హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసిన న్యాయవాదులు
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:44 PM
: కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ను ఏర్పాటు చేయాలంటూ కర్నూలు న్యాయవాదులు అమరావతిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్‌కు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సోమవారం ఇచ్చిన అపాయింట్‌మెంటు మేరకు కర్నూలు న్యాయవాదుల బృందం అమరావతికి వెళ్లి రాష్ట్ర హైకోర్టులో చీఫ్ జస్టి్‌సను కలిశారు.
కర్నూలు లీగల్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్‌ను ఏర్పాటు చేయాలంటూ కర్నూలు న్యాయవాదులు అమరావతిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్‌కు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సోమవారం ఇచ్చిన అపాయింట్‌మెంటు మేరకు కర్నూలు న్యాయవాదుల బృందం అమరావతికి వెళ్లి రాష్ట్ర హైకోర్టులో చీఫ్ జస్టి్‌సను కలిశారు. గత 30సంవత్సరాలుగా భౌగోళికంగా కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కర్నూలు వివక్షతకు గురవుతూ ఉందని వారు ప్రధాన న్యాయమూర్తికి ఒక వినతి పత్రం ఇచ్చారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ తప్ప తాము ఏ ఇతర ప్రత్యామ్నాయాన్ని అంగీకరించలేమని అన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేశారని న్యాయవాదులు తెలిపారు. చీఫ్ జస్టి్‌సను కలిసిన వారిలో కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, సీనియర్ న్యాయవాదులు ఏ. రామసుబ్బారెడ్డి, వై. జయరాజు, సి. నాగేంద్రనాథ్, ఎస్. చాంద్‌బాషా, కే. ఓంకార్‌లతో పాటు హైకోర్టు అడ్వకేట్లు కూడా ఉన్నారు.