Share News

ఎన్నికల నిర్వహణలో ముందస్తు ప్రణాళిక అవసరం

ABN , Publish Date - Aug 19 , 2026 | 11:29 PM

గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్రపునేఠా సూచించారు.

ఎన్నికల నిర్వహణలో ముందస్తు ప్రణాళిక అవసరం
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్రపునేఠా

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌, అధికారులు

నంద్యాల నూనెపల్లి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్రపునేఠా సూచించారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ముందస్తు చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ రాజకుమారి, డీపీవో, జడ్పీ సీఈవో, మున్సిపల్‌ కమిషనర్లు హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటి దాకా చేపట్టాల్సిన ఎన్నికల ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరిస్తూ జిల్లాలో మొత్తం 12 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయని, వాటి జాబితా, గుర్తింపు, కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తయ్యిందని తెలిపారు. 20 వార్డులకు సమగ్ర ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి సమగ్ర ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరు 3న సమగ్ర ఓటర్ల జాబితానను ప్రచురించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అదనపు బ్యాలెట్‌ బాక్సుల అవసరాన్ని గుర్తించినట్లు వివరించారు.

Updated Date - Aug 19 , 2026 | 11:29 PM