Share News

ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:38 AM

ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని మహిళలు కోరారు. జిల్లా సాధన జేఏసీ చేపట్టిన దీక్షలు గురువారానికి 47వ రోజుకు చేరుకున్నాయి.

ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలి
దీక్షలో కూర్చున్న తిరుమల నగర్‌ కాలనీ మహిళలు

కొత్త సంవత్సరం రోజు దీక్షలో మహిళలు

ఇళ్ల ముందు ముగ్గులు

ఆదోని అగ్రికల్చర్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని మహిళలు కోరారు. జిల్లా సాధన జేఏసీ చేపట్టిన దీక్షలు గురువారానికి 47వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో తిరుమల నగర్‌ కాలనీకి చెందిన మహిళలు ఆదోని జిల్లా సాధనలో మేము భాగస్వాములు అవుతామని దీక్షలు చేపట్టారు. ముందుగా కాలనీ దగ్గర నుంచి మహిళలంతా ర్యాలీగా వచ్చి కోట్ల కూడలి దీక్షా శిభిరాన్ని చేరుకొని అక్కడ కరణం జయశ్రీ, రేణుకమ్మ, లలితమ్మ, లక్ష్మమ్మ, బంగారమ్మ, జ్యోతిర్మయి, హిరణ్మయి, ప్రసన్న కుమారి, లావణ్య మహేశ్వరి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా జేఏసీ మహిళా నాయకురాలు లలిత జితేంద్ర, ఉషారాణి మాట్లాడుతూ ఆదోని జిల్లా కోసం 47 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం, పాలకులు పట్టించుకోకపోవడం బాఽధాకరమని అన్నారు. వెనుకబడిన పశ్చిమ ప్రాంతాలైన ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు పత్తికొండ, మంత్రాలయ నియోజవర్గాలు అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పల్లెకు పోయినా పంటలు పండక రైతులు వలసలు వెళుతున్నారన్నారు. పశ్చిమ ప్రాంత పల్లెలు అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా చేయాల్సిందేనని అన్నారు. జేఏసీ పిలుపు మేరకు ఆదోనిలోని పలువులు మహిళలు కొత్త సంవత్సరానికి స్వాగతం తెలుపుతూ ఇంటి ముందు ఆదోని జిల్లా కావాలంటూ ముగ్గులు వేసి నిరసన తెలిపారు. దీక్షలకు ఏపీ ఎనజీవో నాయకులు ఉషారాణి, ఉపాధ్యాయ సంఘ నాయకులు జగదీశ, బీజేపీ నాయకులు వెల్లాల మధుసూదన శర్మ, లలితమ్మ సంఘీభావం తెలిపారు. జేఏసీ నాయకులు రఘురామయ్య అశోకానంద రెడ్డి, కృష్ణమూర్తి గౌడ్‌, కోదండ, టి.వీరేశ, కుంకనూరు వీరేశ, దస్తగిరి పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 12:39 AM