Share News

కేజీబీవీలో మానసకు అడ్మిషన్‌

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:32 AM

ఆ చిన్నారికి చదువు అంటే ఎంతో ఇష్టం. తల్లిదండ్రులు బతుకు దెరువు కోసం వలసలు వెళ్తుంటారు. 1 నుంచి 5వ తరగతి వరకు మండలంలోని నెరుడుప్పల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే చదువు కొనసాగించింది. ఇక చదువుకోవాలంటే గోనెగండ్లకు రావాల్సిందే. చదువు కోసం మానస మదన పడింది.

 కేజీబీవీలో మానసకు అడ్మిషన్‌
6వ తరగతి అడ్మిషన్‌ ఇస్తున్న ఎస్‌ఎస్‌ఏ పీవో లోక్‌నాఽథ్‌

మంత్రి లోకేశ్‌ చొరవతో స్పందించిన అధికారులు

గోనెగండ్ల, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): ఆ చిన్నారికి చదువు అంటే ఎంతో ఇష్టం. తల్లిదండ్రులు బతుకు దెరువు కోసం వలసలు వెళ్తుంటారు. 1 నుంచి 5వ తరగతి వరకు మండలంలోని నెరుడుప్పల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే చదువు కొనసాగించింది. ఇక చదువుకోవాలంటే గోనెగండ్లకు రావాల్సిందే. చదువు కోసం మానస మదన పడింది. తల్లిదండ్రులు వలస వెళ్తే తన చదువును ఎక్కడ ఉండి కొనసాగించాలో అర్థంకాలేదు. తన సమస్యను సోషల్‌ మీడియా ద్వారా మంత్రి నారా లోకేశ్‌కు విన్నవించింది. తనకు కేజీబీవీలో సీటు ఇప్పించాలని వేడుకుంది. స్పందించి మంత్రి కేజీబీవీలో సీటు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కర్నూలు ఎస్‌ఎ్‌సఏ ప్రాజెక్టు అధికారి లోక్‌నాథ్‌ హుటాహుటిన స్పందించారు. గోనెగండ్లలోని కేజీబీవీ పాఠశాలలో ఆరవ తరగతి లో సీటు ఇస్తున్నట్లు అడ్మిషన్‌ ధ్రువ పత్రాన్ని ఆచిన్నారికి అందజేశారు. తనకు కేజీబీవీలో సీటు ఇప్పించిన మంత్రి నారా లోకేశ్‌కు చిన్నారి మానసతో పాటు తల్లిదండ్రులు వీరేశ్‌, భాగ్యమ్మ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jun 12 , 2026 | 12:32 AM