Share News

గజ వాహనంపై ఆది దంపతులు

ABN , Publish Date - Feb 14 , 2026 | 11:57 PM

శ్రీశై లంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

గజ వాహనంపై ఆది దంపతులు
గజవాహనంపై స్వామి.. అమ్మవార్లు, గ్రామోత్సవంలో పాల్గొన్న భక్తులు

బ్రహ్మోత్సవ శోభలో శ్రీగిరి

లక్షలాది మంది భక్తుల నడుమ గ్రామోత్సవం

నేడు మహా శివరాత్రి వేడుకలు

శ్రీశైలం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): శ్రీశై లంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజైన శనివారం భ్రమరాంబ సమేతుడైన మల్లన్న గజవా హనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన వేదికపై గజవాహనంపై శ్రీస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనుల జేసి విశేషా ర్చనలు నిర్వహించారు. అనంతరం గజ వాహ నంపై స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వ హించారు. ఈ వేడుకలో వివిధ కళారూపాల ప్రద ర్శనలు కట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దేవదాయ కమిషనర్‌ రాంచంద్రమోహన్‌, ఈవో శ్రీనివాస రావు, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌ నాయుడు పాల్గొన్నారు.

నేడు మహా శివరాత్రి వేడుకలు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం మహాశివరాత్రిని పురస్కరించుకొని సాయంత్రం స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం కార్యక్రమం, 7గంటలకు నందివాహన సేవ, 10 గంటలకు లింగోద్భవ కాల మహన్యాస పూర్వక ఏకాదశ రుధ్రాభిషేకం, పాగాలంకరణ, రాత్రి 12గంటలకు స్వామి, అమ్మవార్ల లీలా కల్యాణం జరుగుతాయి.

శ్రీశైలం.. భక్త జనసంద్రం

హరోం హరా.. శంకరా అంటూ పాదయాత్రగా వస్తున్న భక్తుల శివనామస్మరణతో క్షేత్ర పరిసరాలు ఆధ్యాత్మికతను సంతరించు కున్నాయి. శివరాత్రి పర్వదినానికి ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు అటవీ ప్రాంతాల నుంచి పాదయాత్రలు చేస్తూ శ్రీగిరికి చేరుకుంటు న్నారు. తెల్లవారుజాము నుంచి పాతాళగంగలో సుమారు 80 వేల మంది భక్తులు రోప్‌ వే, మెట్ల మార్గం ద్వారా వెళ్లి పుణ్య స్నానాలు చేసుకున్నట్లు అధికారుల అంచనా. కృష్ణమ్మకు సారెలు సమర్పించి మొక్కులు తీర్చుకుని కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించు కుంటున్నారు. ఉచిత దర్శన క్యూలైన్లు, రూ.200, రూ.500ల ప్రత్యేక క్యూలైన్ల ద్వారా వెళ్లిన భక్తులకు దర్శనానికి సుమారు గంట సమయం పడుతోంది. దేవస్థానం అన్న ప్రసాద భవనంతోపాటు నిత్యాన్నదాన సత్రాలు, స్వచ్ఛంద అన్న ప్రసాద వితరణ శిబిరాల వద్ద రోజుకు లక్ష మందికి పైగా అల్పాహార భోజనాలను వండి వడ్డిస్తున్నారు. దేవస్థానం ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రత్యేకంగా వైద్య సదుపాయాలు కల్పించారు.

ఏర్పాట్ల పరిశీలన

శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శనివారం అధికారులు వేర్వేరుగా పరి శీలించారు. దేవదాయ కమిషనర్‌ రాంచం ద్రమోహన్‌ మాట్లాడుతూ కనీస సౌకర్యాల కల్పనలో రాజీపడేది లేదని అన్నారు. శివరాత్రి రోజున అధిక సంఖ్యలో భక్తుల వచ్చి వెళ్లే మార్గాల్లో అప్రమత్తంగా ఉండా లని సూచించారు. శివరాత్రి పర్వదినం సందర్బంగా స్వామి, అమ్మవార్లను సుమారు 1.5లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నందున వారికి కల్పించిన వసతుల్లో ఎటువంటి లోపాలు తలెత్తకుండా పర్యవేక్షించుకోవలసిన బాధ్యత అధికారులు సిబ్బందిపైనే ఉంటుందని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. ఆలయ ప్రాంగణంలో పాగాలంకరణ కోసం చేసిన ఏర్పాట్లను డీఐజీ కోయ ప్రవీణ్‌ పరిశీలించారు. వీఐపీ గ్యాలరీ, భక్తులు ప్రవే శించే ప్రధాన ద్వారం, ఎగ్జిట్‌ పాయింట్‌లలో అదనపు భద్రతను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్పీ సునీల్‌ షెరాన్‌ శనివారం దేవస్థానం కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు క్యూలైన్‌ల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. శనివారం సుమారు 84 వేల మంది భక్తులు దర్శించుకోగా అందులో 32,543 మంది శివస్వాములు ఉన్నారని ఎస్పీ తెలిపారు.

Updated Date - Feb 14 , 2026 | 11:57 PM