Share News

ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరి

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:43 PM

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సూచించారు.

ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరి
ట్రాఫిక్‌ అవగాహన వాహనాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సూచించారు. శనివారం కొండారెడ్డి బురుజు వద్ద కర్నూలు ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధునాతన ట్రాఫిక్‌ అవగాహన వాహనాన్ని ఎస్పీ ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రహదారి భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించేందుకు డిజిటల్‌ స్ర్కీన్‌తో కూడిన అధునాతన అవగాహన ట్రాఫిక్‌ వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ డిజిటల్‌ స్ర్కీన్‌పై ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్గించే వీడియోలను ప్రదర్శిస్తారన్నారు. అనంతరం సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ హుస్సేన్‌ పీరా, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ కృష్ణమోహన్‌, హోంగార్డ్స్‌ డీఎస్పీ ప్రసాద్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ మధుసూదన్‌రావు, ట్రాఫిక్‌ సీఐ మన్సూరుద్దీన్‌, ట్రాఫిక్‌ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:43 PM