Share News

అడిషనల్‌ సివిల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ప్రారంభం

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:38 PM

నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన అడిషనల్‌ సివిల్‌ మెజిస్ట్రేట్‌ కమ్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టును శనివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణమోహన్‌, జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ హరిహరనాథ్‌ శర్మ ప్రారంభించారు.

అడిషనల్‌ సివిల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ప్రారంభం
కోర్టును ప్రారంభిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌

నందికొట్కూరు, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన అడిషనల్‌ సివిల్‌ మెజిస్ట్రేట్‌ కమ్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టును శనివారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణమోహన్‌, జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ హరిహరనాథ్‌ శర్మ ప్రారంభించారు. ముందుగా న్యాయమూర్తులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా అనంతరం సర్వమత పార్థనలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులను నంద్యాల ఎస్పీ సునీల్‌ షెరాన్‌ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలను అందజేశారు. నాయయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త కోర్టుల ఏర్పాటు కీలకంగా మారుతుందని న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి, నందికొట్కూరు సివిల్‌, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారులు శోభారాణి, దివ్య, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 11:38 PM