Share News

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:19 PM

: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ హెచ్చరించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
పోలీసులతో మాట్లాడుతున్న ఎస్పీ సునీల్‌ షెరాన్‌

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

అవుకు, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సునీల్‌ షెరాన్‌ హెచ్చరించారు. శుక్రవారం అవుకు పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి సైబర్‌ క్రైమ్‌, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. త్వరలో జరగనున్న ఇంటర్‌, 10వ తరగతి పరీక్షలపై ప్రత్యేక దృష్టి ఉంచాలన్నారు. ఎస్‌ఐ అశోక్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

కొలిమిగుండ్ల: సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సునీలల షెరాన్‌ అన్నారు. శుక్రవారం కొలిమిగుండ్ల పోలీసుస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా సుమారు 3గంటల పాటు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, ఇక్కడి పరిస్థితులు, పాత నేరాలపై కొలిమిగుండ్ల సీఐ రమేశ్‌బాబుతో చర్చించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌చేసి డబ్బు ఆశ చూపితే ఎటువంటి వివరాలు వెల్లడించరాదని, అత్యాశకు పోతే ఇబ్బందులు తప్పవని ప్రజలకు హెచ్చరించారు. ఇటీవల మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ అభిప్రాయపడ్డారు. జిల్లా మహిళల రక్షణే ప్రధాన ధ్యేయంగా పోలీసులు పని చేస్తున్నారన్నారు. శిథిలావస్థలో ఉన్న పోలీసు క్వార్టర్స్‌ పునర్నిర్మాణానికి రాష్ట్ర అధికారులకు ప్రతిపాదనలు పంపుతామని ఎస్పీ అన్నారు. పోలీస్‌ క్వార్టర్స్‌ను ఆయన పరిశీలించారు. విద్యుత్‌, తాగునీరు, ప్రాంగణం అందుబాటులో ఉన్న గృహాలు శిథిలావస్థకు చేరుకోవడంతో పోలీసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నూతన గృహ సముదాయాన్ని నిర్మిస్తామని ఎస్పీ అన్నారు

Updated Date - Feb 20 , 2026 | 11:19 PM