నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:31 PM
రైతుబజార్‌ల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల ఎడ్యుకేషన్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రైతుబజార్‌ల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల టెక్కె మార్కెట్‌యార్డులోని రైతుబజార్‌ను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ స్వ యంగా కూరగాయలను కొని వాటి ధరలు, నాణ్యతను పరిశీలించారు. వినియోగదారులు, రైతులతో మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారుల సంతృప్తి రైతు ప్రయోజనాలకు అనుగుణంగా రైతుబజార్‌లు ఉండాలని మా ర్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. పారిశుధ్య నిర్వహణ, పరిసరాల అపరిశు భ్రతపై అసహనం వ్యక్తంచేశారు. వారం రోజుల్లోపు అన్ని సమస్యలు పరిష్కరించి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని ఏడీఎం అబ్దుల్‌రహెమాన్‌ను ఆదేశించారు. జిల్లాలో రైతుబజార్ ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రజలు కూడా శుభ్రత పాటించడంలో సహకరించాలని కోరారు.