నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - May 01 , 2026 | 11:04 PM
ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, మే 1 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాల యంలో రఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజ లు , టీడీపీ నాయకులు, కార్యకర్తల అర్జీలను మంత్రి స్వయంగా స్వీకరించారు. పలు అర్జీలను స్వయంగా చదివి సంబంఽధిత అధికారులకు ఫోన్లు చేశారు. రెవెన్యూ, ఇతర సమస్యలకు సంబంధించిన అర్జీలను అధికారు లు త్వరగా పరిష్కరించాలని ఆదే శించారు. ఆయన మాట్లాడుతూ ప్ర జా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. అర్జీలను పరిష్కరించడానికి కృషి చేసిన మంత్రి బీసీని ప్రజలు అభినందించారు.