కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
ABN , Publish Date - Apr 21 , 2026 | 10:54 PM
వ్యవసాయేతర పరిశ్ర మల అవసరాల కోసం యూరియాను వినియోగించినట్లు తెలిసినా, కృత్రిమ కొరత సృష్టించినట్లు నిరూపణ అయినా కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల క్రైం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయేతర పరిశ్ర మల అవసరాల కోసం యూరియాను వినియోగించినట్లు తెలిసినా, కృత్రిమ కొరత సృష్టించినట్లు నిరూపణ అయినా కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన ఎరువుల టాస్క్‌ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సరఫరా చేయాల్సిన యూరియా ను పరిశ్రమలకు వినియోగించినట్లు తెలిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో నంద్యాల ఏఎస్‌పీ ఎం. జావళి ఆల్ఫోన్స్, వ్యవసాయ శాఖ జేడీ వెంకటేశ్వర్లు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.