గ్యాస్ డెలివరీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:39 AM
గ్యాస్ డిస్ర్టిబ్యూటర్లు ఇళ్లకు సరఫరా చేసే గ్యాస్ డెలి వరీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఏ. సిరి హెచ్చరించారు.
కలెక్టర్ డా.ఏ. సిరి
వెల్దుర్తి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): గ్యాస్ డిస్ర్టిబ్యూటర్లు ఇళ్లకు సరఫరా చేసే గ్యాస్ డెలి వరీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఏ. సిరి హెచ్చరించారు. గురువారం వెల్దుర్తి సంపూర్ణ ఇండెన్ గ్యాస్ గోడౌన్‌ను జేసీ నూరుల్ ఖమర్‌తో కలిసి తనిఖీ చేశారు. గ్యాస్ బుకింగ్, గోడౌన్‌లో నిల్వ, డెలివరీ గురించి అడిగి తెలుసుకున్నారు. స్టాక్‌ను పరిశీలించారు. డొమెస్టిక్ సిలిండర్లు 6, 11 వాణిజ్య సిలిండర్లు తక్కువగా ఉండడంపై అసహనం వ్యక్తం చేస్తూ నోటీసులివ్వాలని డీఎస్‌వోను ఆదేశించారు. గోడౌన్ పరిధిలో నిబంధనల ప్రకారం అగ్నిమాపక భద్రతా చర్యలు పాటించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తగిన చర్యలు తీసుకోవాలని అగ్నిమాపకశాఖ అధికారిని ఆదేశించారు. డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలుచేస్తే చర్యలు తప్పవన్నారు. జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ ప్రజలు గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, డీఎస్‌వో రాజారఘువీర్, అగ్నిమాపకశాఖ అధికారి జయసింహ, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రాముడు పాల్గొన్నారు.