Share News

బ్యానర్లు, పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - May 26 , 2026 | 12:52 AM

అనుమతి లేకుండా బ్యానర్లు, పోస్టర్లు అతికించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరకపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించారు. బళ్లారి చౌరస్తా వద్ద ఇటీవల హైవే రిటైనింగ్‌ వాల్‌పై రంగులు వేసి అందంగా తీర్చిదిద్దగా కొందరు పోస్టర్లు అతికించి పాడు చేశారు. డివైడర్లకు పోస్టర్లు అతికించి అపరిశుభ్రంగా మార్చారు.

బ్యానర్లు, పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు
పోస్టర్లను తొలగించాలని సూచిస్తున్న కమిషనర్‌

నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, మే 25(ఆంధ్రజ్యోతి): అనుమతి లేకుండా బ్యానర్లు, పోస్టర్లు అతికించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరకపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించారు. బళ్లారి చౌరస్తా వద్ద ఇటీవల హైవే రిటైనింగ్‌ వాల్‌పై రంగులు వేసి అందంగా తీర్చిదిద్దగా కొందరు పోస్టర్లు అతికించి పాడు చేశారు. డివైడర్లకు పోస్టర్లు అతికించి అపరిశుభ్రంగా మార్చారు. సోమవారం ఆయా ప్రాంతాలను సందర్శించిన కమిషనర్‌ సంబంధిత వ్యక్తలకు కాల్‌చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే వాటిని తొలగించాలని లేకపోతే మున్సిపట్‌ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని అందంగా, సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్య రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న సుందరీకరణ పనులపై పోస్టర్లు, బ్యానర్లు అతికించి పాడు చేసే వారిపై ఉదాసీన వైఖరి ప్రదర్శించొద్దని అన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఉన్న అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛత పనులకు ఆటంకల కలగకుండ ఇంజనీరింగ్‌ విభాగ అధికారులతో సమన్వ యం చేసుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజారోగ్య అధికారి డా.ఎం.రఘు, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్‌బాషా, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ జిలానీ పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2026 | 12:53 AM