దళారులు చొరబడితే కఠిన చర్యలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:42 AM
సి..క్యాంపు రైతుబజారులో దళారులు ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్టేట్ అధికారి కళ్యాణమ్మ, హార్టికల్చర్ అసిస్టెంట్ శివకుమార్ హెచ్చరించారు. సోమవారం రైతు బజార్‌ను తనిఖీ చేసి, తూకం కాటాలను పరిశీలించారు.
రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కళ్యాణమ్మ
కర్నూలు అగ్రికల్చర్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): సి..క్యాంపు రైతుబజారులో దళారులు ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్టేట్ అధికారి కళ్యాణమ్మ, హార్టికల్చర్ అసిస్టెంట్ శివకుమార్ హెచ్చరించారు. సోమవారం రైతు బజార్‌ను తనిఖీ చేసి, తూకం కాటాలను పరిశీలించారు. ధరల పట్టిక ప్రకారమే కూరగాయలను విక్రయించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. పండ్లు విక్రయించేవారు రసాయనాలు వాడ రాదని ప్లాస్టిక్ కవర్లను వినియోగించరాదని ఆదేశించారు.సెక్యూరిటీ గార్డులు గోపాల్, హనుమంతు, శ్రీనివాసరెడ్డి, గురువయ్య, శ్రీనివాసరెడ్డి, చిన్నస్వామి పాల్గొన్నారు.