Share News

మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:12 AM

:జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పటిష్ట చర్యలు చేపట్టామని కలెక్టర్‌ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మంది రంలో నిర్వహించిన ఎన్‌కార్డ్‌(ఎన్‌సీవోఆర్‌డీ) సమావేశంలో జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ, గంజాయి సాగు, అక్రమ రవాణా నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.

మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి) :జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పటిష్ట చర్యలు చేపట్టామని కలెక్టర్‌ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మంది రంలో నిర్వహించిన ఎన్‌కార్డ్‌(ఎన్‌సీవోఆర్‌డీ) సమావేశంలో జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ, గంజాయి సాగు, అక్రమ రవాణా నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. మహిళా భద్రత, మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రత అనే మూడు ప్రధాన అంశాలపై అవగాహన కల్పించే ‘ఆపరేషన్‌ త్రిశూల్‌’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లాలో గంజాయి సాగు, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న 300 డ్రగ్స్‌ టెస్టింగ్‌ కిట్లలో ఇప్పటి వరకు 114 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం గుర్తించిన వారిని అవసరమైన మేరకు కర్నూలు, విశాఖపట్నం, కోయంబత్తూరు డీ-ఆడిక్షన్‌ కేంద్రాలకు పంపించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. డీఆడిక్షన్‌ కేంద్రంలో సిబ్బంది కొరతను పరిష్కరించేందుకు అవసరమైన నియమక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, బాధితులకు నిరంతర పర్యవేక్షణ కౌన్సిలింగ్‌, చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని 1972 హెల్ప్‌లైన్‌కు అందజేసి సహకరించాలన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఇప్పటి వరకు ఈగల్‌ టీమ్‌ ఐదు పల్లెబాట కార్యక్రమాలు, 13 డ్రగ్స్‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈగల్‌ ఏపీ 1972 కర్నూలు పేరుతో ఇన్‌స్ర్టాగ్రామ్‌ పేజీని ప్రారంభించి డ్రగ్స్‌ వ్యతిరేక కార్యక్రమాలకు సంబందించి 30 సెకన్ల వీడియోలు, రీల్స్‌ విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీవో శాంతి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, డీఈవో సుధాకర్‌, సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి రాధిక, బీసీ వెల్ఫేర్‌ అధికారి ప్రసూన, మెప్మా పీడీ శ్రీనివాసులు, డీసీఆర్‌బీ సీఐ గుణశేఖర్‌బాబు, ట్రాఫిక్‌ సీఐ మన్సూరుద్దీన్‌; మహిళా పీఎస్‌ సీఐ మస్తాన్‌వలి, డీటీఆర్‌బీ సీఐ ఆదిలక్ష్మీ, ఈగల్‌ టీమ్‌ ఆర్‌ఎ్‌సఐ రమే్‌షబాబు, ఈగల్‌ టీమ్‌ పోలీసు అధికారలు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 12:13 AM