నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ABN , Publish Date - Oct 22 , 2026 | 11:00 PM
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కేంద్రాల వద్ద అమలులో ఉన్న నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సునీల్ షెరాన్ హెచ్చరించారు.
ఎస్పీ సునీల్ షెరాన్
శిరివెళ్ల, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి) : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కేంద్రాల వద్ద అమలులో ఉన్న నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సునీల్ షెరాన్ హెచ్చరించారు. శిరివెళ్లలోని మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను ఆయన గురువారం పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ప్రకారం ముందస్తు అనుమతులు లేకుండా ప్రజలు గుమికూడదన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద వీడియోగ్రఫీ, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామన్నారు. జిల్లాలో రెండో రోజు నామిషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగిందన్నారు. ఆయన వెంట ఎస్‌ఐ మధుసూదన, సిబ్బంది ఉన్నారు.