బాలల హక్కులను హరిస్తే చర్యలు
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:20 AM
ప్రతి చిన్నారి విద్యను అభ్యసించటంతో పాటు రక్షణ పొందే హక్కు ఉంద ని, వారి హక్కులను హరిస్తే చర్యలు తప్పవని జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద హెచ్చరించారు .
జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్, జూలై 6(ఆంధ్రజ్యోతి): ప్రతి చిన్నారి విద్యను అభ్యసించటంతో పాటు రక్షణ పొందే హక్కు ఉంద ని, వారి హక్కులను హరిస్తే చర్యలు తప్పవని జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద హెచ్చరించారు . సోమవారం నగరంలోని ప్రయివేటు కళాశాలలో బాలల హక్కులు, రక్షణ, సైబర్ భద్రత, బాల్య వివాహలు నివారణ, మత్తు పదార్థాల జోలికి వెళ్లకపోవటం తదితర సామాజిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. శారద మాట్లాడుతూ బాలలపై వేధింపులకు పాల్పడినా, వారి హక్కులను హరించిన బాధ్యులపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈగల్ సెల్ అధికారి ఎలీషా మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక మాధ్యమాలను పరిమితంగా వినియోగించాలని, సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు. డీసీపీయూ అధికారి టి.నాగేశ్వరరావు మాట్లాడుతూ చిన్నారులు ఏదైనా ఆపదలో ఉంటే ప్రభుత్వ హెల్ప్‌లైన నెంబరు 1098కు ఫోన చేయాలని సూచించారు.