విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:10 PM
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల టౌన్, సెప్టంబర్ 25 (ఆంధ్రజ్యోతి): విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. శుక్రవారం నంద్యాల అర్బన్ పరిధిలోని 20వ నెంబర్ అంగ న్‌వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీచేశారు. హాజరు పట్టికను పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం నాణ్యత, పంపి ణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేంద్రాల నిర్వహ ణలో అలసత్వం వహించరాదన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
కుందూ నది బ్రిడ్జిని..
పట్టణం శివారులో ఉన్న కుందూ నది బ్రిడ్జిని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మా ట్లాడుతూ ప్రధానంగా వర్షాలు పడినప్పుడు కుందూ ప్రవాహం ఎక్కు వైనప్పుడు నందమూరినగర్, వైఎస్సార్ నగర్, కొన్ని గ్రామాల ప్రజలు బ్రిడ్జిపై రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారందరికీ సురక్షితంగా రవాణా సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం కట్టు బడి ఉందన్నారు. బ్రిడ్జికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ బండి శేషన్న, డిప్యూటీ కలెక్టర్ ప్రి యాంక, ఆర్డీవో విశ్వనాథ్, పబ్బతి వేణు పాల్గొన్నారు. వర్షాల కారణంగా ప్రథమనందికి వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ మున్సిపల్, రెవెన్యూ, ఆర్‌ఆండ్‌బీ అధికారులతో కలిసి పరిశీలిం చారు. ఆలయం చైౖర్మన్ చలంబాబు వినతి పత్రం అందజేశారు. మంత్రి మాట్లాడుతూ కూలిన బ్రిడ్జికి శాశ్వత పరిష్కారం చూపు తామన్నారు. పట్టణంలోని భీమాస్ హోటల్ ఎదురుగా ఉన్న రోడ్డు వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. విద్యార్థులు, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విష యాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన రోడ్డు పనులు వెంటనే చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.