విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:31 AM
పారిశుధ్య విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు.
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): పారిశుధ్య విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. బుధవారం పాతబస్తీ, జొహరా పురం, ఏ.క్యాంపు తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. చిత్తారివీధిలో దోమల నివారణలకు లార్వీసైడ్ మందు పిచికారీని పరిశీలించారు. ఇటీవల సీజ్ చేసిన చిన్న, పెద్ద కబేళాలను పరిశీలించారు. కలెక్టరేట్‌లోని అన్న క్యాంటీనను తనిఖీ చేశారు. ఆరో వార్డు చిన్న కబేళా వద్ద చెత్తతో కూడిన ట్రాక్టర్‌ను రోడ్డుపైనే నిలిపి ఉంచడంతోపాటు, మరో ట్రాక్టర్‌తో పారిశుధ్య పనులు నిర్వహిస్తుండ టంపై కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై శానిటరీ ఇనస్పెక్టర్‌ను వివరాలు అడగ్గా, డ్రైవర్ రాము విధులకు సక్రమంగా హాజరు కావడంలేదని లేదని, దీంతో చాలా కాలంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఆయన వెంట శానిటరీ ఇనస్పెక్టర్లు ఆర్.రాజు, శివశంకర్ ఉన్నారు.