పిల్లలతో అనైతికంగా వ్యవహరిస్తే చర్యలు
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:19 AM
పిల్లలతో ఎవరైనా ఆసహజంగా, ఆనైతికంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పోక్సో కోర్టు అదనపు జిల్లా న్యాయాధికారి రాజేంద్ర బాబు హెచ్చరించారు. సోమవారం స్థానిక దామోదరం సంజీవయ్య ఉన్నత పాఠశాలలో సురక్షిత బచ్చన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు
పోక్సో కోర్టు అదనపు న్యాయాధికారి రాజేంద్రబాబు
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పిల్లలతో ఎవరైనా ఆసహజంగా, ఆనైతికంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పోక్సో కోర్టు అదనపు జిల్లా న్యాయాధికారి రాజేంద్ర బాబు హెచ్చరించారు. సోమవారం స్థానిక దామోదరం సంజీవయ్య ఉన్నత పాఠశాలలో సురక్షిత బచ్చన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు న్యాయాధికారి రాజేంద్రబాబు మాట్లాడుతూ బాలలు తమ హక్కులపై అవగాహన కల్గి ఉండాలని, లైంగిక వేధింపులు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, ఫిర్యాదు చేసే విధానాలు, ఉచిత న్యాయ సలహాలపై పలు సూచనలు చేశారు. అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన మాట్లాడుతూ భద్రత, పరిరక్షణపై బాలలకు అవగాహన పెంచాలన్నారు. డీసీపీయూ శారద, పాఠశాల ప్రధానోపాఽధ్యాయులు విజయ నిర్మల, లయన్స్ క్లబ్ ప్రతినిధి రాయపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.