సర్వేయర్లపై చర్యలు తప్పవు
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:19 PM
సర్వేయర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఏ.సిరి హెచ్చరించారు.
కర్నూలు కలెక్టరేట్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): సర్వేయర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఏ.సిరి హెచ్చరించారు. గురు వారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో సర్వే డిపార్టుమెంట్‌కు సంబం ధించిన ఎఫ్‌పీవోఎల్‌ఆర్, రీసర్వే, ఐవీఆర్ కాల్స్ సర్వేకు సంబంధించిన అంశాలపై విలేజ్ సర్వేయర్లు, మండల సర్వేయర్లు, సంబంధిత అధికా రులతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విలేజ్ సర్వేయర్లు అటెండెన్స్ వేయడం లేదని, ప్రతిరోజూ విధులకు హాజరైనట్లు వంద శాతం హాజరు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ నూరుల్ ఖమర్, జిల్లా సర్వే అధికారి మురళీకృష్ణ, ఆర్డీవో సందీప్‌కుమార్ పాల్గొన్నారు.