చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:51 AM
వలసల నివారణకు చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.
కలెక్టర్ సిరి
కర్నూలు కలెక్టరేట్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): వలసల నివారణకు చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. విశాఖ పట్టణంలోని ఏ1 గ్రాండ్ కన్వెన్షన్ హాలులో నీతి అయోగ్ నిర్వహించిన అస్పిరేషనల్ డిస్ర్టిక్ట్ అండ్ బ్లాక్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించి ప్రాంతీయ ఉత్తమ పద్ధ్దతుల సెమినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెమినార్‌లో గ్రీన్ అవియన్ టాప్ లీవ్స్ డీహైడ్రేషన్ యూనిట్ అనే అంశంపై ప్రజంటేషన్ ఇచ్చారు. చిప్పగిరి, మద్దికెర, హొళగుంద వంటి మండలాల్లో సాగులో ఎక్కువ భాగం వర్షాధార వ్యవసాయంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు.