కేజీబీవీలో సమస్యలు పునరావృతమైతే చర్యలు
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:27 PM
కొత్తపల్లి కేజీబీవీలో సమస్యలు మళ్లీ పునరావృతమైతే చర్యలు తప్పవని డీఈవో జనార్దన్ రెడ్డి హెచ్చ రిం చారు.
దురుసుగా ప్రవర్తించిన సిబ్బంది తొలగింపు
డీఈవో జనార్దన్ రెడ్డి
కొత్తపల్లి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): కొత్తపల్లి కేజీబీవీలో సమస్యలు మళ్లీ పునరావృతమైతే చర్యలు తప్పవని డీఈవో జనార్దన్ రెడ్డి హెచ్చ రిం చారు. బుధవారం తహసీల్దార్ ఉమారాణి, డీసీడీవో జ్యోతి, ఎంఈవో నాగ రాజుతో కలిసి కేజీబీవీని తనిఖీ చేశారు. అనంతరం ఆయన విద్యార్థులతో విడివిడిగా మాట్లాడి పాఠశాలలో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. ప్రధానంగా టాయిలెట్లు శుభ్రంగా లేవని, నీటి సమస్య ఉందని, భోజనంలో విద్యార్థులకు సాంబార్‌ను తక్కువగా వేస్తున్నారని, స్నాక్స్‌లో పురుగులున్నాయని డీఈవోకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అలాగే సమస్యలపై ప్రశ్నించిన విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించిన సిబ్బం దిలో ఒకరిని విధుల నుంచి తొలగించినట్లు డీఈవో తెలిపారు. అనంతరం డీఈవోతో పాటు ఎంఈవో, తహసీల్దార్, డీసీడీవోలు మధ్యాహ్న భోజనం పరిశీలించి రుచి చూశారు. డీఈవో విలేకరులతో మాట్లాడుతూ కేజీబీవీపై ఇటీవల పలు ఆరోపణలు వస్తున్ననేపథ్యంలో క్షేత్ర స్థాయిలో విచారించినట్లు తెలిపారు. విద్యార్థినులకు సమస్యలు రాకుండా చూసుకోవాలని ప్రిన్సిపల్ కృష్ణబాయి, ఉపాధ్యాయులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.