రోడ్లపై చెత్త వేస్తే చర్యలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:15 AM
నగర రహదా రులపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే చర్యలు తప్పవని నగర పాలకసంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు.
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, జూన 9(ఆంధ్రజ్యోతి): నగర రహదా రులపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే చర్యలు తప్పవని నగర పాలకసంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. మంగళవా రం వెంకటరమణ కాలనీ, గౌరీగోపాల్ ఆసుపత్రి, రైల్వే స్టేషన, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను ఆయన పరిశీ లించారు. బస్టాండ్ ఎదురుగా యూకాన షాపింగ్ కాంప్లెక్స్ సమీపం లోని రహదారిపై ఓ మహిళ చెత్తవేయడానికి రావడంతో కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చెత్త ఎక్కువగా పేరుకుపోయే 50 గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెంచామన్నారు. నగ రంలో వ్యర్థాలు అఽధికంగా వచ్చే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల వద్ద 10 ప్రత్యేక చెత్త ట్రాలీలను అందుబాటులో ఉంచామని, వాటిలోనే చెత్తను వే యాలని కోరారు. ఇంటింటికి చెత్త సేకరణకు సిబ్బంది రాకపోతే నగర పాలక టోల్‌ఫ్రీ నెంబరు 1800 425 9766 లేదా 7422992299కు వాట్సాప్ సందేశం పంపడం ద్వారా ఫిర్యాదు చేయ వచ్చని సూచించారు. అనంతరం కలెక్టరేట్‌లోని అన్న క్యాంటీనను పరిశీలించారు. ఆయన వెంట శానిటేషన ఇనస్పెక్టర్లు జిలానీ, మునిస్వామి, నాగేశ్వరరావు ఉన్నారు.