Share News

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:49 AM

): రాయలసీమ యూని వర్సిటీలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
భిక్షాటన చేస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్థులు

భిక్షాటన చేసి విద్యార్థుల నిరసన

కర్నూలు అర్బన్‌, మార్చి 9(ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూని వర్సిటీలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆర్‌యూ లో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌. నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌. శరత్‌ కుమార్‌, పీడీఎస్‌యూ, ఆర్పీఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రమణ, నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు భిక్షాటన చేశారు. వారు మాట్లాడుతూ వర్సిటీ ఖజానాకు కన్నం వేసిన రిజిస్ర్టార్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. పరిపాలన పేరుతో వర్సిటీకి వచ్చిన అధికారులందరూ పెద్ద ఎత్తున దోపిడీకి తెరలేపి, నిధులన్నీ దండుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి తక్షణమే స్పందించా లని, లేనిపక్షంలో ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. విద్యార్థి నాయకులు హరీశ, రాజు, రాము, బాలాజీ పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:49 AM