బాణసంచా అనధికార విక్రయాలపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:16 PM
బాణసంచా అనధికారిక విక్రయాలు, నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని జేసీ సూరజ్ ధనుంజయ్ ఆదేశించారు.
జేసీ సూరజ్ ధనుంజయ్
నంద్యాల నూనెపల్లి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): బాణసంచా అనధికారిక విక్రయాలు, నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని జేసీ సూరజ్ ధనుంజయ్ ఆదేశించారు. సోమవారం వివిధ శాఖల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తాత్కాలిక బాణసంచా విక్రయ కేంద్రాలకు నిబంధనల ప్రకారం మాత్రమే లైసెన్సులు జారీ చేయాలని ఆదేశించారు. అమ్మకాలు ప్రారంభించే ముందే అన్ని విక్రయ కేంద్రాలను సంయుక్తంగా తనిఖీ చేసి, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, లైసెన్స్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. పెద్దల పర్యవేక్షణలో పిల్లలు బాణసంచా కాల్చాలని, ప్రమాదకరమైన పద్ధతులకు దూరంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా దీపావళి ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.