కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - May 08 , 2026 | 12:21 AM
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు లేకుండా అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్య క్షుడు రమణకుమార్ డిమాండ్ చేశారు.
కర్నూలు ఎడ్యుకేషన, మే 7(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు లేకుండా అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్య క్షుడు రమణకుమార్ డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో గురువారం ఆర్‌ఐవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు ఆర్‌ఐవో లాలెప్పను కలిసి వినతిప త్రం అందజేశారు. ఈసందర్భంగా రమణకుమార్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో ప్రభుత్వ అనుమతులు లేనప్పటికీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆరోపిం చారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు పాల్గొన్నారు.