సీఐపై చర్యలు తీసుకోవాలి: సీపీఐ
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:38 AM
పట్టణ సీఐ ఇంతియాజ్ బాషాపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య డిమాండ్ చేశారు.
డోన రూరల్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): పట్టణ సీఐ ఇంతియాజ్ బాషాపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ ఆధ్వ ర్యంలో పాతబస్టాండులో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలపై ప్రశ్నిస్తే డోన పట్టణ పోలీసులు సీపీఐ మండల కార్యదర్శి నారాయణ, తిమ్మాపురం గ్రామ కార్యదర్శి సురేష్ లను కొట్టడం దారుణమన్నారు.
బేతంచెర్ల: సీపీఐ నాయకులపై దాడి చేసిన డోన పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా, ఎస్‌ఐ నరేంద్రలపై చర్యలు తీసుకోవాలని సీపీఐమండల కార్యదర్శి భార్గవ్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని పాత బస్టాండ్‌లో భార్గవ్ ఆధ్వర్యంలో పట్టణ కార్యదర్శి నాగరాజు అధ్యక్షతన నిరసన రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శులు తాలుకా తిరుమలేష్, డి దస్తగిరి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాఽధ్యక్షుడు ఉదయ్ పాల్గొన్నారు.
కొలిమిగుండ్ల: సీపీఐ నాయకులపై దాడి చేసిన డోన పట్టణ సీఐ ఇంతియాజ్ బాషాపై చర్యలు తీసుకోవాలని సీపీఐ మండల కార్య దర్శి సూర్యనారాయణ డిమాండ్ చేశారు. డోనలో సీపీఐ నాయకులు నారాయణ, సురేష్‌లపై జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ జయప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.
రుద్రవరం: సీపీఐ నాయకులపై దాడి చేసిన సీఐ ఇంతియాజ్ బాషాపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు బాలనరసిం హులు, భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం రుద్రవరం తహసీ ల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
ప్యాపిలి: డోన సీపీఐ నాయకులు నారాయణ, సురేష్‌లను అక్ర మంగా నిర్భంధించిన సీఐ ఇంతియాజ్ బాషాపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్ర హం దగ్గర సీపీఐ నాయకులు ఆందోళన చేశారు. కార్యక్రమంలో వెంక టేష్, గోవిందు, శ్రీనివాసులు, నాగన్న పాల్గొన్నారు.
బనగానపల్లె: డోన పట్టణ సీఐ ఇంతియాజ్ బాషాపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ మండల కమిటీ కార్యదర్శి శివయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని పెట్రోల్ బంకు కూడ లిలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు సంజీవులు, ఖాదర్, శినాగయ్య, సుబ్రహ్మణ్యం ఉన్నారు.