కార్మిక సమస్యలపై కదనం
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:54 PM
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎప్ టీయూ నాయకులు డిమాండ్ చేశారు.
లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్
సార్వత్రిక సమ్మెలో భాగంగా ఎరుపెక్కిన నంద్యాల
నంద్యాల రూరల్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎప్ టీయూ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం దేశవ్యాప్త స మ్మెను పరిష్కరించుకుని వివిధ విభాగాలకు చెందిన కార్మికులతో కలిసి పట్టణంలోని మార్కెట్ యార్డు నుంచి శ్రీనివాససెంటర్ మీదుగా గాందీచౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగరాజు, సుంకయ్య, ఐఎప్‌టీయూ నాయకులు చౌడప్ప మాటా ్లడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను విస్మరించాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 44 లేబర్ కోడ్‌లనే అమలు చేయా లని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగిం చాలని, జీరాంజీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఎడాదికి 200 రోజులు పని దినాలు కల్పించి, రోజు వారి వేతనం రూ 600 ఇవ్వాలని కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తూ, బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు ఇప్పించాలన్నారు. రైతులు పండించిన పంటలను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఎరువుల ధరలు తగ్గించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి బాబాపకృద్దీన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, తోటమద్దులు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు మురళి, శ్రీనివాసులు, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నిర్మలమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు రమణకుమారి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట నిరసన...: దేఽశవ్యాప్త సమ్మెకు మద్దతుగా ఏపీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు హూస్సేన్‌రెడ్డి మాట్లాడుతూ నూతన కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. పీఎప్‌ఆర్డీఏ చట్టం రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, వెంగళరెడ్డి పాల్గొన్నారు.