Share News

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:28 PM

అహోబిలంలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
మాట్లాడుతున్న భూమా అఖిలప్రియ

ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

నంద్యాల రూరల్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): అహోబిలంలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శుక్రవారం ఎస్పీ సునీల్‌ షెరాన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాటాడారు. అహోబిలంలో టెండర్లు నిర్వహించకుండానే తలనీలాలను విధుల నుంచి సస్పెండ్‌ అయిన సీఈవో పార్ధసారధి తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా నకిలీ పత్రాలు చూపుతున్న అతడికి మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి వత్తాసు పలుకుతున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్యెల్యే తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిజాలతో నేడు ఎస్పీ ఎదుటకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. శ్రీశైలం, అహోబిలం వంటి పుణ్యక్షేత్రాలలో అవినీతికి, అక్రమాలను పాల్పడిన ఘనత వైసీపీ నాయకులదేనన్నారు. అహోబిళంలో రూ.25 కోట్లతో పర్యాటకులకు పలు కార్యక్రమాలు చేపట్టామ న్నారు.

Updated Date - Jul 10 , 2026 | 11:28 PM