Share News

పనితీరు మారకుంటే చర్యలు తప్పవు

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:17 AM

అధికారుల పనితీరు మెరుగు పరుచుకోకుంటే చర్యలు తప్పవని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి హెచ్చరించారు. గురువారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మున్సిపల్‌ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.

పనితీరు మారకుంటే చర్యలు తప్పవు
సమీక్షలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోట్ల

డోన్‌ ఎమ్మెల్యే కోట్ల

డోన్‌ టౌన్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): అధికారుల పనితీరు మెరుగు పరుచుకోకుంటే చర్యలు తప్పవని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి హెచ్చరించారు. గురువారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మున్సిపల్‌ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. పారిశుద్య లోపం, ప్లాస్టిక్‌ వినియోగం, అక్రమ నిర్మాణాలు, దోమల నివారణ చర్యలు, తాగునీటి సరఫరా, విద్యుత్‌ సమస్యలు, పార్కులు నిర్వహణలో అధికారుల తీరుపై ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎందుకు పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవల విషయంలో నిర్లక్ష్యం, అలసత్వం, బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. జూలై మొదటి వారం నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులకు జరిమానాలు విధించాలని ఆదేశించారు. డోన్‌ను పరిశుభ్రంగా, సుందరంగా ప్రజలకు అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. డీఎస్పీ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాద్‌గౌడు, కోట్రికే ఫణిరాజ్‌, కోట్రికే హరికిషన్‌, మున్సిపల్‌ డీఈ రఘు, ఏఈ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 12:17 AM