ట్యాంపరింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
ABN , Publish Date - May 19 , 2026 | 12:24 AM
: పెట్రోల్ బంకుల యజమానులు ట్యాంపరింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ కే.పవన్ కిషోర్, ఎస్‌ఐ వెంకట ప్రసాద్, లీగల్ మెట్రాలజీ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ జిలాని, ఇన్స్‌పెక్టర్ నాగరాజు హెచ్చరించారు
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల హెచ్చరిక
డోన్ టౌన్, మే 18 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్ బంకుల యజమానులు ట్యాంపరింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ కే.పవన్ కిషోర్, ఎస్‌ఐ వెంకట ప్రసాద్, లీగల్ మెట్రాలజీ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ జిలాని, ఇన్స్‌పెక్టర్ నాగరాజు హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని జియో పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. బంకులో ప్రమాణిక కొలతల పాత్రల (స్టాండర్డ్ మెజరింగ్ జార్స్) సాయంతో ఇంధన పరిమాణాలను తనిఖీ చేశామ న్నారు. ఇకపై అన్ని పెట్రోల్ బంకుల్లో తనిఖీ చేస్తామన్నారు.