Share News

మంచి మార్కులు సాధించాలి

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:31 AM

పదో తరగతి విద్యార్థులు మంచి మార్కులతో విజయం సాధించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సిరి సూచించారు. బుధవారం మండలంలోని వర్కూరు వద్ద వున్న కస్తూర్బా గురుకుల విద్యాలయాన్ని తనిఖీ చేశారు.

మంచి మార్కులు సాధించాలి
విద్యార్థినులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిరి

పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్‌ సూచన

కోడుమూరు రూరల్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులు మంచి మార్కులతో విజయం సాధించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సిరి సూచించారు. బుధవారం మండలంలోని వర్కూరు వద్ద వున్న కస్తూర్బా గురుకుల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. పాఠాలు, మ్యాథ్స్‌ అర్థం అవుతున్నాయా అని విద్యార్థినులను ఆరా తీశారు. ముందురోజు నిర్వహించిన సోషల్‌ పరీక్షలో మార్కుల వివరాలను తెలుసుకున్నారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఉన్నత విద్య చదివి ఉద్యోగాలు సాధించాలని విద్యార్థులను కోరారు. అనంతరం బాల్య వివాహాల అనర్థాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. కలెక్టర్‌ వెంట డీఈవో సుధాకర్‌, బీసీ సంక్షేమ అధికారి ప్రసూన ఉన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 12:31 AM