Share News

హత్య కేసులో నిందితుడి అరెస్టు

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:15 AM

పట్టణానికి చెందిన నిందితుడు వెంకటే్‌షగౌడును హత్య కేసులో అరెస్టు చేసినట్లు సీఐ మంజునాథరెడ్డి శనివారం తెలిపారు

హత్య కేసులో నిందితుడి అరెస్టు
నిందితుడిని చూపుతున్న సీఐ, ఎస్‌ఐ

అవుకు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పట్టణానికి చెందిన నిందితుడు వెంకటే్‌షగౌడును హత్య కేసులో అరెస్టు చేసినట్లు సీఐ మంజునాథరెడ్డి శనివారం తెలిపారు. వివరాలు.. పట్టణంలోని కోట వీధిలో ఉయ్యాలవాడ సుధాకర్‌, వెంకటే్‌షగౌడు నివసించేవారు. చెన్నకేశవస్వామి ఆలయం వద్ద ఈనెల 16న ఉయ్యాలవాడ సుధాకర్‌పై కత్తితో వెంకటేష్‌ గౌడు దాడి చేశాడు. పొట్టలోని పేగులు బయటకొచ్చాయి. కుటుంబ సభ్యులు సుధాకర్‌ను అవుకు, నంద్యాల, కర్నూలు ప్రభుత్వాస్ప్రతులకు తరలించి చికిత్స అందించారు. వారం రో జుల చికిత్స అనంతరం కోలుకోలేక ఈనెల 22న అతడు మరణించాడు. నిందితుడిని బనగానపల్లె నెహ్రూ స్కూల్‌ సమీపంలో అరెస్ట్‌ చేశారు. మృతుడి భార్యతో వెంకటే్‌షగౌడు వివాహేతర సంబంధం ఏర్పరుచుకోవాలనే ఉద్దేశ్యంతో కత్తితో పొడిచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వెంకటే్‌షగౌడుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

మరో కేసులో ముగ్గురు..

ఆళ్లగడ్డ,సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఈనెల 18న చింతకుంట గ్రామానికి చెందిన మిద్దె నాగార్జున హత్య కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు రూరల్‌ సీఐ బివీ రమణ శనివారం తెలిపారు. చింతకుంట గ్రామానికి చెందిన పాములేటి, లక్ష్మినరసయ్య, బుట్టగల తిరుపాలును నంద్యాల జాతీయ రహదారిలోని అంజనేయ స్వామి గుడి వద్ద అరెస్టుచేసి కోర్టుకి పంపామన్నారు. ఉయ్యలవాడ ఎస్‌ఐ రామిరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 12:15 AM