హత్య కేసులో నిందితుల అరెస్టు
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:20 AM
ఉయ్యలవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 18న చింతకుంట గ్రామానికి చెందిన మిద్దె నాగార్జునను హత్యచేసిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ బివీ రమణ తెలిపారు.
ఆళ్లగడ్డ,సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉయ్యలవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 18న చింతకుంట గ్రామానికి చెందిన మిద్దె నాగార్జునను హత్యచేసిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ బివీ రమణ తెలిపారు. గురువారం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిందితుల అరెస్టు చూపించారు. సీఐ మాట్లాడుతూ నిందితులు చింతకుంట గ్రామానికి చెందిన బి రమణ, ఎస్ ప్రసాద్, కే ఓబులేసును ఆళ్లగడ్డలోని కాచింతల ఆలయం సమీపంలో అరెస్టుచేసి వారి నుంచి నేరానికి ఉపయోగించిన మూడు వేట కొడవళ్లును స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం వారిని రిమాండ్ నిమిత్తం కోవెకుంట్ల కోర్టులో హాజరు పరిచామన్నారు. కేసు దర్యాప్తులో ఉందని ఇంకా కొంత మంది ముద్దాయిలు పరారీలో ఉన్నారని వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో ఉయ్యలవాడ ఎస్‌ఐ రామిరెడ్డి పాల్గొన్నారు.