లారీ చోరీ కేసులో.. నిందితుల అరెస్టు
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:16 PM
నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రిలయన్స్ మార్ట్ వెనుకాల లారీ అసోసియేషన్ పార్కింగ్‌లో ఉంచిన లారీని చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
కర్నూలు క్రైం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రిలయన్స్ మార్ట్ వెనుకాల లారీ అసోసియేషన్ పార్కింగ్‌లో ఉంచిన లారీని చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు బుడగ జంగాల సురేశ్ గోపాల్, బుడగ జంగాల సతీశ్ కుమార్‌లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి లారీని రికవరీ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో సతీశ్ గతంలో లారీ డ్రైవర్‌గా పని చేస్తూ అనతికాలంలోనే రెండు లారీలను కొనుగోలు చేశాడు. అయితే సరైన రవాణా జరగకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. ఫైనాన్స్ నిర్వాహకులు లారీని సీజ్ చేయడంతో అప్పులు తీర్చుకోవడానికి లారీని చోరీ చేసినట్లుగా పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించాడు. మరో నిందితుడు గోపాల్ మీద నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్, ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో సుమారు 8కి పైగా దొంగతనం కేసులు ఉన్నాయి.
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో ఈనెల 4వ తేదిన ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ యజమాని సాధిక్‌పై కత్తులతో దాడి చేసి హత్యాయత్నం కు పాల్పడిన కేసులో మంగళవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డిఎప్పీ రవికుమార్ తెలిపారు. స్ధానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిందితులను చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాశింతల వద్ద నిందితులు దుర్గాప్రసాద్, అనిల్ కుమార్‌రెడ్డిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి కత్తులను, ద్విచక్ర వాహనాన్ని సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన నిందితులను అనతి కాలంలోనే అరెస్టు చేసిన పోలీసులు, సిబ్బందిని డిఎస్పీ రవికుమార్ అభినందించారు. టౌన్ సీఐ రాము, ఎస్ఐలు చిన్నపీరయ్య, శ్రీనివాసు గౌడ్, రామక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.