మహిళ హత్య కేసులో భర్త అరెస్టు
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:41 AM
ఇటీవల డోన్ పట్టణానికి చెందిన బలిజ ఈశ్వరి హత్య కేసులో భర్త షేక్ ఇంతియాజ్ బాషాను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు.
డోన్ టౌన్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఇటీవల డోన్ పట్టణానికి చెందిన బలిజ ఈశ్వరి హత్య కేసులో భర్త షేక్ ఇంతియాజ్ బాషాను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ ఇంతియాజ్ బాషా విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. డోన్ పట్టణంలో కృష్ణార్జున నగర్‌లో నివాసముంటున్న బలిజ ఈశ్వరి (35)ను భర్త ఇంతియాజ్ బాషా పదేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరి కాపురం సజావుగా సాగుతున్నప్పటికీ ఇంతియాజ్ బాషాకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించిన భార్య తరుచూ ప్రశ్నిస్తూ ఉండటంతో కొంత కాలంగా వీరి మధ్య కలహాలు కొనసాగుతన్నాయి. ఈ నేపథ్యంలో భార్యగా అడ్డుగా ఉందని భావించి ఇనుపరాడ్డుతో దాడి చేసి హత్య చేశాడు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్లను స్వాధీనం చేసుకుని నిందితున్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితున్ని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఎస్‌ఐలు శరత్ కుమార్ రెడ్డి, నరేంద్ర కుమార్ ఉన్నారు.