నిందితుల అరెస్టు
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:20 AM
పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో ఈనెల 13వ తేదీన బోయ శ్రీనివాసులు హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టుచేశారు. బుధవారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో నిందితులను విలేకరుల ఎదుట చూపుతూ సీఐ జయన్న వివరాలు వెల్లడించారు
పత్తికొండ టౌన్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో ఈనెల 13వ తేదీన బోయ శ్రీనివాసులు హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టుచేశారు. బుధవారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో నిందితులను విలేకరుల ఎదుట చూపుతూ సీఐ జయన్న వివరాలు వెల్లడించారు. కుటుంబంలో ఆస్తి తగాదాల్లో భాగంగా ఇద్దరు కుమార్తెలు, అల్లుడి సాయంతో బోయ శ్రీనివాసులను భార్య హత్య చేసింది. హత్యకు ఉపయోగించిన రాడ్లు, కట్టెలను, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. సిబ్బందిని డీఎస్పీ వెంకటరామయ్య అభినందించారు.
దోపిడీ దొంగల అరెస్టు
కర్నూలు క్రైం: నాలుగో పట్టణ పోలీస్ స్టేసన్ పరిధిలో బళ్లారి చౌరస్తా వద్ద షఫీ అనే వ్యక్తిపై దాడి చేసి సెల్ ఫోన్, నగదు అపహరించిన కేసులో ఇద్దరు నిందితు లను పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మకూరు చెందిన షఫీ ఈ నెల 13న హైదరాబాదు నుంచి కర్నూలుకు వచ్చాడు. బళ్లారి చౌరస్తా వద్ద బస్సు దిగి నిలబడి ఉండగా.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు షఫీ తో గొడవ దిగి అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకుని ఉడాయించారు. కేసు నమోదు చేసుకన్న పోలీ సులు సీసీ కెమెరాల ఆధారంగా బాలా జీనగర్‌కు చెందిన అరుణ్ కుమార్, మణికుమార్‌లుగా గుర్తించారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. వీరిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
వ్యభిచార నిర్వాహకుల అరెస్టు
కర్నూలు క్రైం,: నాలుగో పట్టణ పోలీస్ స్టేసన్ పరిధిలో పోస్టల్ కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. సి.బెళగల్‌కు చెందిన ఏసన్న, రాజు, కర్నూ లు అశోక్ నగర్ చెందిన రాఘవేంద్ర, గుత్తి చెందిన మాసుమ న్నలు ఈ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు.