స్మార్ట్‌ఫోన్లతో డిజిటల్ సేవలు వేగవంతం
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:49 PM
వీవోఏలకు(గ్రామ సం ఘాల సహాయకులు) స్మార్ట్‌ఫోన్లు అందించడంతో డిజిటల్ సేవలు వేగవం తమవుతాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
ఓర్వకల్లు/కల్లూరు, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): వీవోఏలకు(గ్రామ సం ఘాల సహాయకులు) స్మార్ట్‌ఫోన్లు అందించడంతో డిజిటల్ సేవలు వేగవం తమవుతాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మంగళవారం ఓర్వకల్లులోని హోంప్లేస్ కార్యాలయంలో, కల్లూరు లోని మండల పరిషత కార్యాలయంలో వీవోఏలకు స్మార్ట్‌ఫోన్లు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల అభివృద్ధిలో వీవోఏల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీవోఏలు వార ధులుగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో మండల సమైఖ్య గౌరవ సలహాదారాలు విజయభారతి, ఓర్వకల్లు, కల్లూరు ఎంపీడీవోలు నాగ అనసూయ, జి.నాగశేషాచలరెడ్డి, ఏపీఎం వెంకట్రా మిరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి, ఎస్‌ఐ సునీల్ కుమార్, నాయకులు లక్ష్మీకాంత రెడ్డి, మోహనరెడ్డి, మేడం రామాం జనేయులు, యేసేపు, మండల ఐక్య సంఘం అధ్యక్షురాలు రత్న మ్మ, కల్లూరు తహసీ ల్దార్ కె.ఆంజనేయులు, వెలుగు ఏపీఏ పుష్పవతి, కల్లూరు మండల టీడీపీ నాయకులు మాదేష్, డి.శేఖర్, రామాంజనే యులు, సహారాబీ, జుబేదాబీ పాల్గొన్నారు.