Share News

రింగ్‌ రోడ్డు పనులు వేగవంతం చేయండి

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:06 AM

బనగానపల్లె పట్టణ శివారులో నిర్మిస్తున్న రింగ్‌ రోడ్డు పనులు వేగవంతం చేయాలని ఆర్‌ ఆండ్‌బీ అధికారులను గురువారం ఆర్‌ఆండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌ వీ.కే విజయశ్రీ ఆదేశించారు.

రింగ్‌ రోడ్డు పనులు వేగవంతం చేయండి
రింగ్‌రోడ్డు పనులను పరిశీలిస్తున్న ఆర్‌ఆండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌ వీ.కె విజయశ్రీ

చీఫ్‌ ఇంజనీర్‌ విజయశ్రీ

బనగానపల్లె, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): బనగానపల్లె పట్టణ శివారులో నిర్మిస్తున్న రింగ్‌ రోడ్డు పనులు వేగవంతం చేయాలని ఆర్‌ ఆండ్‌బీ అధికారులను గురువారం ఆర్‌ఆండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌ వీ.కే విజయశ్రీ ఆదేశించారు. ఆమె బనగానపల్లె పట్టణ శివారులోని బత్తు లూరుపాడు గ్రామ సమీపంలో నిర్మించిన బీటీ రోడ్ల పనులు స్వయంగా పరిశీలించారు. పాణ్యం రోడ్డు వద్ద జరుగుతున్న పనులను కూడా పరిశీలించారు. రింగ్‌ రోడ్డు మ్యాప్‌ను పరిశీలించి, పనులు నాణ్యంగా, వేగవంతం చేయాలన్నారు. ఈ పనులు పూర్తయితే భారీ వాహనాలు రింగ్‌ రోడ్డు మీదుగా ఊరి బయటే వెళ్తాయన్నారు. దీని వల్ల బనగానపల్లె పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఉండదని అన్నారు. ఈ కార్యక్ర మంలో ఆమె వెంట ఆర్‌ఆండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీఈ రెడ్డిగోవింద్‌, ఏఈ డీ.హుసేన్‌ ఆమె వెంట ఉన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:06 AM