Share News

సాధారణం కంటే ఎక్కువ వర్షం

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:48 PM

జూన్‌ నెలలో ఎల్‌నినో ప్రభావం కనిపించకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకుం టున్నారు. మంగళవారం ఓర్వకల్లులో 20.2ఎంఎం, తుగ్గలిలో 16.8, కర్నూలు రూరల్‌లో 8.8ఎంఎం, హాలహర్విలో 5.2, కర్నూలు అర్బన్‌లో 3.4, కల్లూరులో 0.4 ఎంఎం వర్షం నమోదైంది.

సాధారణం కంటే ఎక్కువ వర్షం
పొలాల్లో విత్తనాలు విత్తుకుంటున్న రైతులు

జూన్‌లో 77.7 ఎంఎంకు గాను

ఇప్పటికే 98.4 ఎంఎం నమోదు

కర్నూలు అగ్రికల్చర్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): జూన్‌ నెలలో ఎల్‌నినో ప్రభావం కనిపించకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకుం టున్నారు. మంగళవారం ఓర్వకల్లులో 20.2ఎంఎం, తుగ్గలిలో 16.8, కర్నూలు రూరల్‌లో 8.8ఎంఎం, హాలహర్విలో 5.2, కర్నూలు అర్బన్‌లో 3.4, కల్లూరులో 0.4 ఎంఎం వర్షం నమోదైంది. ఈ నెలలో కురవాల్సిన వర్షం 77.7 ఎంఎం కాగా, మంగళవారం నాటికి 98.4 ఎంఎం వర్షం నమోదైంది. 27 ఎంఎం కంటే ఎక్కువే కురిసిందని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు. జూన్‌ నెల ప్రారంభం నుంచి ఇప్పటి దాకా వివిధ మండలాల్లో కురిసిన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. ఓర్వకల్లులో 76.4 ఎంఎం, తుగ్గలిలో 66.2 ఎంఎం, కర్నూలు రూరల్‌లో 97, హాలహర్విలో 169.8 ఎంఎం, కర్నూలు అర్బన్‌లో 92.8, కల్లూరులో 71.8, మంత్రాలయంలో 154.8, కోసిగిలో 111.6, కౌతాళంలో 67.6, పెద్దకడుబూరులో 92.2, ఎమ్మిగనూరులో 111 ఎంఎం వర్షం మొత్తం సగటున నమోదు కావడంతో రైతులు పొలాల్లో విత్తనాలు విత్తుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ఆదోనిలో 119.6, హొళగుందలో 146.8, ఆలూరులో 141.2, దేవనకొండలో అన్ని మండలాల కంటే అత్యధికంగా 170.6, కృష్ణగిరిలో 76, వెల్దుర్తిలో 99.2, పత్తికొండలో 116.4, చిప్పగిరిలో 153 ఎంఎం వర్షం ఈ నెలలో 23 రోజుల్లో వర్షపాతం నమోదైందని జేడీ వరలక్ష్మి తెలిపారు. ఎల్‌నినో ప్రభావం జూన్‌లో కనిపించలేదని, జూలై నుంచి ఆగస్టు వరకు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.

Updated Date - Jun 23 , 2026 | 11:48 PM