Share News

ఆరోగ్యశ్రీ నిధులు తక్షణమే విడుదల చేయాలి

ABN , Publish Date - Apr 03 , 2026 | 11:28 PM

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.3000 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు తక్షణమే విడుదల చేయాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ డిమాండ్‌ చేశారు.

ఆరోగ్యశ్రీ నిధులు తక్షణమే విడుదల చేయాలి
మాట్లాడుతున్న సీపీఎం నాయకులు

సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్‌

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.3000 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు తక్షణమే విడుదల చేయాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గౌస్‌దేశాయ్‌ మాట్లాడుతూ తమకు రావాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేయనందుకు ఏప్రిల్‌ 1 నుంచి ఎన్టీఆర్‌ వైద్య సేవలను నిలుపుదల చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల యాజ మాన్యం నిర్ణయం తీసుకోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రాలు రెండు సార్లు ఆరోగ్యశ్రీ నిధుల కోసమే సమ్మె చేయ డం దురదృష్టకరమన్నారు. ఈ రకంగా ప్రజల ప్రాణాలతో చెలగాట మాడడం సరికాదని ఘాటుగా విమర్శించారు. కార్యక్రమంలో పాతబస్తీ కార్యదర్శి ఎం.రాజశేఖర్‌, నగర కార్యదర్శి టి.రాముడు, నాయకులు విజయ్‌, నగేష్‌, సాయిబాబా, సుధాకరప్ప, షరీఫ్‌, అబ్దుల్లా, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 11:28 PM