ఆరోగ్యశ్రీ కేసులను 80 శాతానికి పెంచాలి
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:55 PM
ఆరోగ్యశ్రీ కేసులను 80 శాతానికి పెంచాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వివిధ విభాగాల హెచవో డీలను ఆదేశించారు.
కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ కేసులను 80 శాతానికి పెంచాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వివిధ విభాగాల హెచవో డీలను ఆదేశించారు. శనివారం కర్నూలు మెడికల్ కాలేజీ కాన్ఫరెన్స హాలులో సర్వజన వైద్యశాల మెడికల్ కాలేజీలకు సంబంధించిన వైద్యసే వలు మౌలిక వసతులపై వివిధ విభాగాల హెచవోడీలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. క్రిటికల్ కేర్‌బ్లాక్‌లో జరుగుతున్న ఆక్సిజన పైపులైన, లిఫ్టు పనులు మే 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఏపీఎంఎస్‌ఐడీసీ ఎస్‌ఈ ఇందిరను ఆదేశించారు. కమ్యూనిటీ మెడిసిన విభాగంలో విద్యార్థుల సం క్షేమ కార్యక్రమాలు, గ్రామీణ దత్తత కార్యక్రమం కోసం ఒక బస్సు కావా లని వైద్యులు కోరగా. దీనికి సంబంధించి నివేధిక ఇవ్వాలని కలెక్టర్ ప్రిన్సి పాల్ డా.కే.చిట్టినరసమ్మను ఆదేశించారు. ఈఎనటీ విభాగంలో ఇద్దరు అసి స్టెంట్ ప్రొపెసర్లు లేరని, దీని వల్ల సదరం క్యాంపులు, ఓపీలు ఆపరేషన్లు నిర్వహించం కష్టంగా ఉందని, పీజీ వైద్యవిద్యార్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చా రు. సమీక్షలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్య శాల సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపల్స్ డా.హరి చరణ్, డా.రేణుకాదేవి, డా.శ్రీరా ములు, డిప్యూటీ సూపరింటెడెంట్ డా.లక్ష్మిబాయి పాల్గొన్నారు.