Share News

గిరిజనులందరికీ ఆధార్‌ తప్పనిసరి

ABN , Publish Date - Nov 14 , 2026 | 11:29 PM

నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే చెంచు గిరిజనులందరికీ ఆధార్‌ గుర్తింపు తప్పనిసరిగా ఉండాలని శ్రీశైలం చెంచు గిరిజన సంక్షేమాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పీడీ పీవీఎస్‌ నాయుడు అధికారులను ఆదేశించారు.

గిరిజనులందరికీ ఆధార్‌ తప్పనిసరి
నోడల్‌ అధికారులతో మాట్లాడుతున్న పీవో పీవీఎస్‌ నాయుడు

ఐటీడీఏ పీవో పీవీఎస్‌ నాయుడు

శ్రీశైలం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే చెంచు గిరిజనులందరికీ ఆధార్‌ గుర్తింపు తప్పనిసరిగా ఉండాలని శ్రీశైలం చెంచు గిరిజన సంక్షేమాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పీడీ పీవీఎస్‌ నాయుడు అధికారులను ఆదేశించారు. నంద్యాల మార్కాపురం పల్నాడు జిల్లాలకు చెందిన నోడల్‌ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ ఆధార్‌ యూఐడీఏఐ సంస్థ కార్యాలయం వారు పంపిన జాబితా ప్రకారం ఇప్పటివరకు ఆధార్‌కార్డు పొందని చెంచు గిరిజనులకు గుర్తింపు నమోదు చేయించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాకు ఒక నోడల్‌ అధికారి పర్యవేక్షణలో క్షేత్ర స్థాయి అధికారులు సిబ్బంది కలిసి సుమారు 188 గిరిజన తండాలు గ్రామాల్లో ఆధార్‌ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పారు. అదే విధంగా పాఠశాలల్లో విద్యార్థులకు కూడా ఆధార్‌ నమోదు, బయోమెట్రిక్‌ అనుసంధానం తప్పనిసరిగా చేయించాలని పేర్కొన్నారు.

Updated Date - Nov 14 , 2026 | 11:29 PM