సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:25 AM
ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ ఆటో మోటార్ ట్రాన్స పోర్టు వర్కర్స్ యూనియన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ డిమాండ్ చేశారు.
ట్రాన్సపోర్టు వర్కర్స్ యూనియన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ ఆటో మోటార్ ట్రాన్స పోర్టు వర్కర్స్ యూనియన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట యూనియన అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆటో కార్మికుల కు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ట్రాఫిక్ చలానా పేరుతో కార్మికులపై భారం అవుతున్న జీవో 2131 రద్దు చేయాలన్నారు. స్వయం ఉపా ధితో వాహనాలు కొనుగోలు చేసే కార్మికు లకు వడ్డీలేని బ్యాంకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. ఆటో కార్మికుల పిల్లలకు ఉచిత చదువు, ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం ఇప్పించాలని, పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నక్కి లెనినబాబు, యూనియన జిల్లా నాయకులు గణేష్, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు జి.చంద్రశేఖర్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రామాంజనేయులు, ఆర్.కృష్ణా రెడ్డి, నాగరాజు, అబ్బాస్, ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.