Share News

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:03 AM

రాష్ట్రంలోని హోటల్‌ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.మునెప్ప, సీనియర్‌ నాయకుడు మనోహర్‌ మాణిక్యంలు డిమాండ్‌ చేశారు.

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు

ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునెప్ప

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని హోటల్‌ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.మునెప్ప, సీనియర్‌ నాయకుడు మనోహర్‌ మాణిక్యంలు డిమాండ్‌ చేశారు. గురువారం హోటల్‌ అండ్‌ బేకరీ వంట మాస్టర్స్‌ యూనియన(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట జి.పురుషోత్తం అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. మనోహర్‌ మాణిక్యం మాట్లాడుతూ హోటల్‌, డాబా, రెస్టారెంట్లలో మాస్టర్లుగా, క్లీనర్స్‌గా, సప్లయిర్స్‌గా పని చేస్తున్న వేలాదిమంది కార్మికులకు ఎలాంటి భద్రత లేదన్నారు. ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే కార్మికులు చనిపోయే పరిస్థితి ఉంద న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వారిని గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అమలు చేయాలన్నారు. రోజుకు 8 గంటల పని విధానం అమలు చేయాలని, నెలసరి వేతనాలు ఇవ్వాలని, ప్రమాద భీమా రూ.10 లక్షలు కల్పించాలని కోరారు. కార్యక్ర మంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు జి.చంద్రశేఖర్‌, నాయకులు రామాంజనేయులు, ఆనంద్‌బాబు, నాగేంద్ర, నరసింహ, రంగనాయకులు, రేణుక, ధనలక్ష్మి, ఉమా పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:03 AM