ప్రతి ఇంటా ఆనందాల వెల్లువ
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:28 AM
knl news
రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలోని ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. శనివారం పట్టణంలోని రైతునగరంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు అభివృద్ధిని కాలనీవాసులకు వివరిం చారు. సమస్యలను అడిగితెలుసుకున్నారు. మరిన్ని నిధులు తీసుకువచ్చి నంద్యాల నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రైతునగర్‌లోని శ్రీగౌరి కేధార్‌నాధ్ (మరకత లింగం) దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఆలయానికి వచ్చే భక్తులకు, సమీప ప్రజలకు తాగునీటి సౌకర్యం కోసం ఉచిత మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమం లో నంద్యాల మార్కెట్ యార్డు చైర్మెన్ గుంటుపల్లి హరిబాబు, టీడీపీ నాయకులు గుద్దేటి వెంకటేశ్వర్లు, పెద్ద వెంకటసుబ్బయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.