కనువిందుగా ఒలింపిక్ డే రన్
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:46 PM
ఒలంపిక్ డే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలో నిర్వహించిన ఒలంపిక్ డే రన్ కనువిందుగా సాగింది.
కర్నూలు స్పోర్ట్స్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఒలంపిక్ డే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలో నిర్వహించిన ఒలంపిక్ డే రన్ కనువిందుగా సాగింది. ఈ పరుగులో ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థల నేతలతో నగర ప్రధాన రోడ్లన్నీ సందడిగా మారాయి. ఈ రన్ ఒలంపిక్ సంఘం చైర్మన్ డా. షేక్ మహబూబ్ బాషా అధ్యక్షత వహించారు. ఈ రన్‌లో క్రీడాదాత రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఏపీఎస్పీ డీఎస్పీ మహబూబ్ బాషా, త్రీటౌన్ సీఐ శ్రీధర్, విద్యావేత్త డా. కేవీ సుబ్బారెడ్డి, గ్యాస్ర్టో ఎంట్రాలజీ డా.బి. శంకర్‌శర్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శమంతకమణి, అంకాలజిస్టు డా. వాసిరెడ్డి, జిల్లా క్రీడా సంఘాల ప్రతినిధులు అథ్లెటిక్స్ హర్షవర్థన్, వెయిట్ లిఫ్టింగ్ షేక్షావలి, హాకీ దాసరి సుధీర్, రగ్బీ గుడిపల్లి సురేందర్, సాఫ్ట్‌బాల్ గంగాధర్, పవర్ లిఫ్టిక్ వేణుగోపాల్, స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ నబీ సాహెబ్, బాక్సింగ్ తేజ, షూటింగ్ పరశురాముడు, జూడో చంద్రశేఖర్, స్కేటింగ్ అనంత, రైఫిల్ షూటింగ్ బాషా, వాలీబాల్ జాఫర్ మున్నా, స్విమ్మింగ్ లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొన్నారు. వీరు ప్రసంగాల తర్వాత చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారులకు నగదు బహుమతులు ప్రకటించి ఉత్సాహపరిచారు. ఈ రన్ రెండున్న కిలోమీటర్ల పొడుగున కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు క్రీడాజ్యోతితో సాగింది.