Share News

‘ఉపాధి’ని రక్షించుకునేందుకు ఐక్య పోరాటం

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:42 AM

గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తుందని, ఉపాధిహామీ చట్టాన్ని రక్షించుకునేందుకు ఐక్యపోరాటలకు సిద్ధం కావా లని ఏపీ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి కేవీ. నారాయణ కోరారు.

‘ఉపాధి’ని రక్షించుకునేందుకు ఐక్య పోరాటం
మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారాయణ

గోనెగండ్ల, జనవరి 17(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తుందని, ఉపాధిహామీ చట్టాన్ని రక్షించుకునేందుకు ఐక్యపోరాటలకు సిద్ధం కావా లని ఏపీ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి కేవీ. నారాయణ కోరారు. శనివారం గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరశేఖర్‌ అధ్యక్షతన వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కమిటీ, మండల కమిటీ బాధ్యలు సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యసాయ కార్మికసంఘం నాయకులు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టసవరణ గ్రామీణ ప్రాంతాల కూలీలకు, పేదలకు నష్టం కలిగించేందిగా ఉందని, కేవలం పేరు మార్పుగానే కాకుండా చట్టం లో సమూల మార్పులు తీసుకువ చ్చారన్నారు. కేంద్రప్రభుత్వం 100 దినాల నుంచి 125 దినాల పని రోజులు పెంచామని తెలుపుతు న్నప్పటికీ మోసపూరిత మాటన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25 వరకు గ్రామీణ ప్రాంతాలలో సభలు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 26న గాంధీ విగ్రహాల ముందు నిరసన తెలుపుతామన్నారు. ఫిబ్రవరి 12న గ్రామీణ ప్రాంతాలలో సార్వత్రిక సమ్మె నిర్వహిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణలో తీసుకువచ్చిన మార్పులను వెంటనే రద్దు చేయాలని పేదలకు భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న, సంఘం నాయకులు తిక్కన్న, బాలకృష్ణ, నాగన్న, రామాంజినేయులు, సురేంద్ర, దేవేంద్ర, కృష్ణ, శ్రీనివాసులు, ఉచ్చురప్ప, గపూర్‌మియ్య, మహబుబ్‌బాషా, కేపీ రాముడు, యూసుఫ్‌బాషా, రవి, నరసన్న, శిఖామణి, గుంటప్ప, శివ పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 12:42 AM