జగ్జీవనరామ్‌కు ఘన నివాళి
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:40 PM
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవనరామ్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నగరంలోని ఐదురోడ్ల కూడలిలో ఆయన విగ్రహానికి ఎంపీ బస్తి పాటి నాగరాజు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
కర్నూలు అర్బన్, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవనరామ్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నగరంలోని ఐదురోడ్ల కూడలిలో ఆయన విగ్రహానికి ఎంపీ బస్తి పాటి నాగరాజు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు జగ్జీవనరామ్ అని కొనియాడారు. కార్యక్రమంలో కురువ కార్పొ రేషన్ డైరెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవనరామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు తదితరులు నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు బజారన్న, షేక్ ఖాజా హుస్సేన, సాంబశివుడు, బి. సుబ్రహణ్యం, సత్యరాజు, రేపల్లే ప్రతాప్ పాల్గొన్నారు.
జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే
కర్నూలు రూరల్: బాబు జగ్జీవనరామ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు నగరంలోని ఆర్‌ఎస్‌రోడ్డు సర్కిల్‌లో జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కర్నూలు న్యూసిటీ: జగ్జీవనరామ్ అభ్యుదయవాది అని జడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి అన్నారు. ఆదివారం జడ్పీ మినీ సమావేశభవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బా రెడ్డి, పరిపాలన అధికారులు సరస్వతి, నాగేంద్ర ప్రసాద్ జితేంద్ర, అబ్దుల్ హక్, బసవశేఖర్, పుల్లయ్య పాల్గొన్నారు.